రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్లు రాష్ట్ర దేవాదాయ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని, రాజకీయ పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు.
లబ్దిదారుల ఎంపిక కోసం రూపొందించిన యాప్‌ను శనివారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రిగారు పరిశీలించారు. శనివారం సచివాలయంలోని తన కార్యాలయంలో లబ్ధిదారుల ఎంపిక కోసం రూపొందించిన యాప్‌ను మంత్రి పరిశీలించారు. ఈ యాప్‌లో ఒకటి రెండు మార్పులు చేయాలని మంత్రి సూచించారు. మంత్రి ఆదేశాల మేరకు యాప్‌లో కొన్ని మార్పులు చేసి వచ్చే వారం రోజుల్లో యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.