Friday, October 18, 2024

Rafael Nadal | టెన్నిస్ కు స్పెయిన్ బుల్ గుడ్ బై !

టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ ఈరోజు (గురువారం) రిటైర్మెంట్ ప్రకటించాడు. వచ్చే నెలలో జరిగే డేవిస్ కప్‌లో చివరిసారిగా బ‌రిలోకి దిగి ఆటకు వీడ్కోలు పలుకుతానని ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు.

కాగా, రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘమైన కెరీర్‌ ఆడిన నాదల్… 22 గ్రాండ్ స్లామ్స్ టైటిళ్లు సాధించాడు. 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్, రెండు సార్లు వింబుల్డన్, నాలుగు సార్లు యూఎస్ ఓపెన్, రెండు సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లలో ఛాంపియన్‌గా నిలిచాడు. అంతేగాక రఫెల్ నాదల్ 2008 ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాడు. స్పెయిన్ తరఫున అనేక డేవిస్ కప్ విజయాలు, 90 ఏటీపీ టైటిళ్లు గెలిచాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement