బెంగళూరు – భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అంతరిక్షరంగంలో ఎప్పటికప్పుడు సరికొత్త అడుగులు వేస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే మరో ఘనత సాధించింది. తాజాగా వికాస్ లిక్విడ్ ఇంజిన్ రీస్టార్ట్ చేసే డెమోను సక్సెస్ పుల్ గా నిర్వహించింది. వివిధ దశల్లో వికాస్ లిక్విడ్ ఇంజిన్ రీస్టార్ట్‌ను ధ్రువీకరించుకోవడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఈ పరీక్షలను నిర్వహిస్తోంది.
తాజాగా 60 సెకన్ల పాటు ఇంజిన్‌ను మండించగా 120 సెకన్ల పాటు షట్ డౌన్ చేసింది. తర్వాత రీస్టార్ట్ చేసి, ఏడు సెకన్ల పాటు మరోమారు మండించింది. ఈ ప్రక్రియలో ఇంజిన్‌లోని అన్ని పారా మీటర్లు నార్మల్ గా, ఊహించిన విధంగానే ఉన్నాయని ఇస్రో వెల్లడించింది. అలాగే, అంతరిక్షంలో ఉపగ్రహాలను ప్రయోగించిన వాహక నౌకలను మళ్లీ వినియోగించుకోవడానికి చేస్తోన్న టెస్టుల్లో ఇదొక సానుకూల పరిణామం అని పేర్కొనింది. రాకెట్‌లో ద్రవ ఇంధన దశలో వికాస్ లిక్విడ్ ఇంజిన్ ఉంటుంది. ఈ డెమో సక్సెస్ కావడంతో శాస్త్రవేత్తలలో ఆనందం వెల్లివిరిసింది..