Monday, September 30, 2024

Space Craft – ఐఎస్ఎస్ తో స్పేస్ ఎక్స్ క్రాఫ్ట్ అనుసంధానం .. సునీతా రాక‌కు మార్గం సుగ‌మం

సునీతా విలియ‌మ్స్ తిరిగి రాక‌కు మార్గం సుగ‌మం
ఎక్ర్ క్రాప్ట్ ద్వారా తొమ్మిది మంది అంత‌రిక్షం కేంద్రంలోకి ప్ర‌వేశం
తిరుగు ప్ర‌యాణంలో సునీత‌,విల్మోర్ క‌లిసి భూ కేంద్రానికి
ఫిబ్ర‌వ‌రిలో తిరిగి రానున్న స్పెన్ ఎక్స్ డ్రాగ‌న్

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, బ్యారీ బుచ్ విల్మోర్‌ను భూమ్మీదికి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా నాసా పంపించిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్రూ- 9 అంతరిక్ష వాహక నౌక ఐఎస్ఎస్‌కు చేరుకుంది.
మొత్తం తొమ్మిదిమంది అంతరిక్ష పరిశోధకులను ఐఎస్ఎస్‌కు మోసుకెళ్లింది స్పేస్ ఎక్స్ డ్రాగన్. నాసా ఆస్ట్రోనాట్ నిక్ హేగ్ ఈ టీమ్‌కు సారథ్యాన్ని వహించారు. రష్యా వ్యోమగామి అలెక్జాండర్ గొర్బునోవ్, మాథ్యూ డొమినిక్, మైఖెల్ బర్రాట్, జెన్నెట్టె ఈప్స్, డాన్ పెరిట్, అలెగ్జాండర్ గ్రెబెన్కిన్, అలెక్సీ వోచినిన్, ఇవాన్ వాగ్నర్ ఉన్నారు. వారిలో డొమినిక్, బర్రాట్, ఈప్స్, గ్రెబెన్కిన్.. అక్టోబర్‌లో భూమికి తిరిగి వస్తారు.

స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ . ఐఎస్ఎస్‌తో అనుసంధానమైనట్లు నాసా ప్రకటించింది. డ్రాగన్ క్రూ అందులో అడుగు పెట్టినట్లు పేర్కొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి సునీత విలియమ్స్, బ్యారీ విల్మోర్‌ను భూమికి తీసుకొస్తామని, దీనికి సంబంధించిన పనులు వెంటనే మొదలు పెడతామని పేర్కొంది.

కాగా, శనివారం రాత్రి బోట్సువానా నుంచి స్పేస్ ఎక్స్ డ్రాగన్‌ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందినది ఈ స్పేస్ క్రాఫ్ట్. 260 మైళ్ల మేర అంతరిక్షంలోకి ప్రయాణించింది. ఈ దూరాన్ని అధిగమించడానికి ఈ స్పేస్ క్రాఫ్ట్ తీసుకున్న సమయం 25 గంటలు. ఈస్టర్న్ డే లైట్ టైమ్ జోన్ ప్రకారం ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు ఐఎస్ఎస్‌తో అనుసంధానమైంది.

- Advertisement -

ఈ ఏడాది జూన్‌లో సునీతా విలియమ్స్‌ బ్యారీ బుచ్ విల్మోర్‌ను అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి పంపించింది నాసా. ఇది 10 రోజుల ఆపరేషన్. అక్కడ తలెత్తిన కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులను సరిచేయడానికి వారిద్దరినీ స్టార్‌ లైనర్ స్పేస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో అక్కడికి పంపింది. తిరిగి రావడం మాత్రం సాధ్యపడట్లేదు. స్టార్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్ సిస్టమ్‌లో థ్రస్టర్లు పనిచేయకపోవడం, హీలియం లీక్ కావడం సహా అనేక సాంకేతిక సమస్యల కారణంగా వారిద్దరూ అక్కడే చిక్కుకుపోవాల్సి వచ్చింది. ఈ ఏడాది జూన్ 13వ తేదీన బోయింగ్ స్టార్‌లైనర్‌ క్యాప్సుల్‌లో సమస్యల తలెత్తాయి. అప్పటికే అది ఐఎస్ఎస్‌తో అనుసంధానమైంది. సర్వీస్ మాడ్యూల్‌లో హీలియం లీక్‌తో పాటు 28 థ్రస్టర్లల్లో అయిదు పూర్తిగా పని చేయడం మానేశాయి. దీనితో ఈ లోపాలను సరిచేయడానికి రంగంలో దిగింది బోయింగ్ సంస్థ. లోపాలను సరి చేసినప్పటికీ.. అది భూమికి తిరిగి రావడం వరకు మాత్రమే పరిమితమైంది. వ్యోమగాములను తీసుకుని రావడానికి అనుకూలం కాదని ప్రకటించింది. దీనితో బోయింగ్ స్టార్‌లైనర్‌ క్యాప్సుల్‌లో సునీత విలియమ్స్, విల్మోర్‌ను తీసుకుని వచ్చే ప్రయత్నాలకు మానుకుంది నాసా.

Advertisement

తాజా వార్తలు

Advertisement