కృష్ణా జిల్లా ఎస్పీగా సిద్ధార్థ కౌశల్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీలలో భాగంగా కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా బదిలీ కావడంతో ఆ స్థానంలో సిద్ధార్థ కౌశల్ కృష్ణా జిల్లా ఎస్పీగా వచ్చారు. 2012 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ఆయన తొలుత గ్రేహౌండ్స్ లో విధులు నిర్వర్తించి అనంతరం పార్వతీపురం, విశాఖపట్నం ఏఎస్పీగా, ప్రకాశం జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా విధులు నిర్వహిస్తామని, సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కార్యాచరణ రూపొందిస్తూ నూతన ప్రణాళికలు చేపడతామన్నారు. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ మహిళా సంక్షేమానికి వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు, నిలువరిస్తూ నేర రహిత జిల్లాగా కృష్ణా జిల్లా మార్చడంలో తనదైన పాత్ర పోషిస్తానని ఎస్సీ చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement