ఉత్తరప్రదేశ్లో ఘోరం జరిగింది. మెయిన్పురిలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఆదివారం రాత్రి మెయిన్పురిలో సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవేంద్రసింగ్ యాదవ్ వెళ్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. అయితే.. డ్రైవర్ లారీని ఆపకుండానే అట్లానే వెళ్లాడు. దీంతో కారు కూడా ఆ ట్రక్టుతోపాటే ఈడ్చుకుంటూ సుమారు అర కిలోమీటర్ దాకా లాక్కెళ్లాడు. ఈ క్రమంలో మరో బైకు కూడా ప్రమాదానికి గురైంది.
అయితే స్థానికులు లారీని వెంబడించడంతో 500 మీటర్లు వెళ్లిన తర్వాత ఆపాడు. కారులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. సమాజ్వాదీ నాయకుని కారును లారీ ఢీకొట్టిందని, 500 మీటర్లకుపైగా దూరం అలాగే తీసుకెళ్లిందని జిల్లా ఎస్పీ కమలేశ్ దిక్షంత్ చెప్పారు. లారీ డ్రైవర్ను అరెస్టు చేశామన్నారు. ఇది హత్యా యత్నమా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.