నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం దేశమంతా విస్తరించాయని భారత వాతావరణ శాఖ శనివారం ప్రకటించింది. జూన్ 1 వ తేదీన నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తొలుత భారత వాతావరణ శాఖ జోస్యం చెప్పింది. అయితే మూడు రోజుల ముందుగానే, మే 29న కేరళ ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు గుజరాత్, రాజస్థాన్‌లకు కాలానుగుణంగా ప్రవేశించడంతోనే వర్షాలు మొదలైనాయని పేర్కొంది. ‘
‘నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా సాధారణ తేదీ జులై ఎనిమిదో తేదీ వరకు రావల్సి ఉండగా ఆరు రోజుల ముందే వ్యాపించాయని వాతావరణ శాఖ తెలియజేసింది.. నైరుతి రుతు పవనాలు ముందుగానే రావడంతో దేశవ్యాప్తంగా వర్షపాత నిల్వలు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో రుతుపవనాల వేగం పుంజుకుంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.