Friday, November 22, 2024

తెలంగాణలోకి ప్రవేశించిన‌ నైరుతి రుతుపవనాలు..

హైదరాబాద్, : ఐదు రోజుల ఆలస్యం తర్వాత ఎట్టకేలకు తెలంగాణ‌లోకి నైరుతి రుతుప‌వ‌నాలు ప్ర‌వేశించాయి. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, రుతుపవనాలు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు చేరుకున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా వరకు రుతుపవనాలు విస్తరించినట్లు ఐఎండీ హైదరాబాద్ కార్యాలయం తెలిపింది. ఇది మరో 48 గంటల్లో మరింత పురోగమించే అవకాశం ఉంది. రుత‌పవ‌నాల రాక‌తో వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డింది.. వేస‌వి వేడి, ఉక్క‌పోత నుంచి ప్ర‌జ‌ల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగింది.

దీంతో రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణాలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన గాలి మరియు గాలులు (30-40 kmph) సంభవించే అవకాశం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement