Friday, November 22, 2024

జీడీపీలో సౌత్‌ వాటా 30 శాతం.. తలసరి ఆదాయంలో తెలంగాణ ఫస్ట్‌

మన దేశంలో దక్షాణాది రాష్ట్రాలైన తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, తమిళనాడు, కేరళ దేశ ఆర్ధిక వ్యవస్థకు ప్రధాన ఛోదకులుగా ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాలు దేశ జీడీపీలో 30 శాతం వాటా కలిగి ఉన్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఐదు దక్షణాది రాష్ట్రాలు బలమైన ఆర్ధిక వ్యవస్థలు కలగి ఉన్నాయి. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో తమిళనాడు జీఎస్‌డీపీ 24.8 లక్షల కోట్లుగా ఉంది. దక్షణాదిలోనే అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉంది. రెండో స్థానంలో 22.4 లక్షల కోట్లతో కర్నాటక ఉంది. తెలంగాణ రాష్ట్రా జీఎస్‌డీపీ 13.3 లక్షల కోట్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ జీఎస్‌డీపీ 13.2 లక్షల కోట్లుగానూ, కేరళ 10 లక్షల కోట్లుగా ఉంది.

ఆర్ధిక వ్యవస్థలతో పాటు, ఈ రాష్ట్రాల్లో తలసరి ఆదాయం, రాష్ట్రాల ఆదాయం, అప్పులు, వడ్దీ చెల్లింపు రేషియో, ఆర్ధిక లోటు వంటి వాటిని కూడా విశ్లేషించారు. తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణా అగ్రస్థానంలో ఉంది. తెలంగాణలో 2,75,443 రూపాయల తలసరి ఆదాయంతో టాప్‌లో ఉంది. కర్నాటకలో 2,65,623 రూపాయల తలసరి ఆదాయంతో రెండో స్థానంలో ఉంది. తమిళనాడులో 2,41,131 రూపాయల తలసరి ఆదాయంతో మూడో స్థానంలో ఉంది. కేరళలో 2,30,601 రూపాయల తలసరి ఆదాయం ఉంది. ఆంధ్రప్రేదేశ్‌లో 2,07,771 రూపాయల తలసరి ఆదాయంతో చివరి స్థానంలో ఉంది. ఈ ఐదు రాష్ట్రాలు కలిపితే దేశ సగటు తలసరి ఆదాయం కంటే అత్యధికంగా ఉంది. జాతీయ సగటు తలసరి ఆదాయం 1,50,007 రూపాయలుగా ఉంది.

- Advertisement -

రుణాలు.. జీడీపీ రేషియో…

రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉందని చెప్పేందుకు జీఎస్‌డీపీలో రుణాల రేషియో ఏ మేరకు ఉందన్న దాన్ని రిజర్వ్‌ ప్రధానంగా తీసుకుంది. రుణాలు-జీడీపీ రేషియాెె తక్కువగా ఉంటే ఆ స్టేట్‌ ఆర్ధికంగా బలంగా ఉన్నట్లుగా ఆర్బీఐ పేర్కొంది. ఈ విషయంలోనూ తెలంగాణానే టాప్‌లో ఉంది. రుణం-జీడీపీ రేషియో అతి తక్కువగా తెలంగాణాలో 25.3 శాతంగా ఉంది. ఇది కర్నాటకలో 27.5 శాతం, తమిళనాడులో 27.7 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 32.8 శాతం, కేరళలో 37.2 శాతంగా ఉంది. కేరళ చివరి స్థానంలో ఉంది. ఈ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ బలహీనంగా ఉంది.

పన్నుల ఆదాయంలో…

బడ్జెట్‌ అంచనాల ప్రకారం రాష్ట్రాల పన్నుల ఆదాయాన్ని పరిశీలించారు. తమిళనాడు 1,26,644 కోట్ల పన్నుల ఆదాయంతో అగ్రస్థానంలో ఉంది. కర్నాటకలో పన్నుల ఆదాయం 1,11,494 కోట్లు, తెలంగాణాలో 92,910 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో 85,265 కోట్లు, కేరళలో 71,833 కోట్లు పన్నుల రూపంలో ఆదాయం వస్తోంది. పన్నుల ఆదాయం ఎక్కువగా వస్తే ఆయా రాష్ట్రాలు మౌళిక సదుపాయాల కల్పన, ఆరోగ్యం, విద్య పై ఎక్కువగా ఖర్చు చేసేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొంది.

స్టూల ఆర్ధిక లోటు…

తక్కువ ద్రవ్యలోటు ఉన్న రాష్ట్రాలు బలమైన ఆర్ధిక వ్యవస్థలకు ప్రతీకగా ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది. ఇలాంటి రాష్ట్రాలు తక్కువ రుణాలు తీసుకుంటాయని తెలిపింది. ఆర్ధిక క్రమశిక్షణ విషయంలో కర్నాటక టాప్‌లో ఉంది. ఈ రాష్ట్రానికి అతి తక్కువగా 2.8 శబుూతం మాత్రమే ఆర్ధిక లోటు ఉంది. తరువాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ 3.2 శాతం, తమిళనాడు 3.8 శాతం, తెలంగాణా 3.9 శాతం, కేరళ 4.2 శాతం ఆర్ధిక లోటు కలిగి ఉన్నాయి.

ఆదాయం, రుణాల వడ్డీల చెల్లింపుల మధ్య నిష్పత్తి ఎంత ఉందన్న విషయాన్ని ఆర్బీఐ పరిగణలోకి తీసుకుంది. ఈ ఇండికేటర్‌ తక్కువగా ఉన్న రాష్ట్రాలు అభివృద్ధి పనులకు ఎక్కువ ఖర్చు చేసే స్థితిలో ఉంటాయి. వడ్డీలకే ఎక్కువ మొత్తాలు చెల్లిస్తే, అభివృద్ధి పనులకు తక్కువ కెటాయింపులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అతి తక్కువ వడ్డీలు చెల్లిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణా మొదటి స్థానంలో ఉంది. ఇది తెలంగాణాలో 11.3 శాతంగా ఉంది. కర్నాటకలో 14.3 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 14.3 శాతం, కేరళలో 18.8 శాతం, తమిళనాడులో 21 శాతంగా ఉంది. ఇవన్నీ ఆయా రాష్ట్రాల ఆదాయంలో వడ్డీలు చెల్లిస్తున్న శాతాలు, ఈ విషయంలో తమిళనాడు 21 శాతంతో ఆదాయంతో ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్న రాష్ట్రంగా ఉంది.

ఆర్ధికంగా రాష్ట్రం బలంగా ఉందని చెప్పేందుకు పరిశీలించిన ఈ అంశాల విషయంలో దక్షణాదిలోని 5 రాష్ట్రాల్లో తెలంగాణా, కర్నాటక మధ్య గట్టిపోటీ ఉంది. మిగిలిన రాష్ట్రాలు కూడా ఆర్ధిక బలమైనవిగానే ఉన్నాయి. వీటి మధ్య ఉన్న తేడా చాలా స్వల్పంగానే ఉంది. ఈ ఐదు రాష్ట్రాలు దేశ ఆర్ధిక వ్యవస్థకు ప్రధాన ఛోదకులుగా ఉన్నాయి. ఆర్ధికాభివృద్ధిలో ఈ రాష్ట్రాల భాగస్వామ్యం ఎంతో కీలకమైనదిగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement