Sunday, November 24, 2024

రెండు రోజుల్లో తెలంగాణకు నైరుతి.. ఈ నెల 21 తర్వాత ఎప్పుడైనా రావొచ్చు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రైతులకు వాతావరణశాఖ శుభవార్త తెలిపింది. వారం రోజులుగా రాయలసీమలోని శ్రీహరికోట పరిసరప్రాంతాల్లోనే నిలిచిపోయిన నైరుతి రుతుపవనాలు తాజాగా ఏపీలోనే మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రాగల రెండు మూడు రోజుల్లో ద్వీపకల్ప దక్షిణ భారతంలోని మరికొన్ని ప్రాంతాలకూ విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఈ నేపథ్యంలో ఈ నెల 21 నుంచి 25 మధ్య నైరుతి తెలంగాణను తాకే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ నాగరత్న తెలిపారు. వీటి ప్రభావంతో తెలంగాణలో రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

- Advertisement -

మరో రెండు రోజులు వడగాలులు…

మరో రెండు రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దిలాబాద్‌, కుమరంభీం ఆసీఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 40.8 డిగ్రీలు, భద్రాచలంలో 41.8, హకీంపేటలో 37.8, దుండిగల్‌లో 38.6, హన్మకొండలో 39, హైదరాబాద్‌లో 39.2, ఖమ్మంలో 40.6, మహబూబ్‌నగర్‌లో 39.5, మెదక్‌లో 39.4, నల్గొండలో 40, నిజామాబాద్‌ 39. 8 , రామగుండంలో 42 డిగ్రీలగరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement