దక్షిణ కొరియా జట్టు ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. జపాన్‌తో జరిగిన తుది పోరులో విజయ ఢంకా మోగించింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఫైనల్స్‌లో దక్షిణ కొరియా పెనాల్టి షూటౌట్‌లో జపాన్‌ను ఓడించింది. తొలి క్వార్టర్‌ను దక్షిణ కొరియా 1-0 ఆధిక్యంతో ముగించింది. రెండో క్వార్టర్ ముగిసే సమయానికి జపాన్ 1-2 ఆధిక్యంలోకి వచ్చింది. మూడో క్వార్టర్‌లో జపాన్ డిఫెన్సివ్ స్టైల్‌ను కొనసాగించింది. ద.కొరియాను గోల్ చేసేందుకు ఛాన్స్ ఇవ్వలేదు. జపాన్ మరో గోల్‌తో 1-3 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
చివరి క్వార్టర్‌లో ద.కొరియా తన శక్తినంతా ప్రదర్శించి.. మ్యాచ్‌ను 3-3 గోల్స్‌కు తీసుకొచ్చింది. ఆ తరువాత నిర్వహించిన పెనాల్టి షూటౌట్‌లో 2-4తో మ్యాచ్‌ను గెలుచుకుని తొలిసారి ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రీఫీని దక్షిణ కొరియా ముద్దాడింది. దీంతో ద.కొరియా పసిడితో, జపాన్ రజతంతో మెరిసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital