హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్యాసింజర్,సరుకు రవాణా విభాగాలలో దక్షిణ మధ్య రైల్వే అత్యుత్తమ స్థాయి పనితీరును నమోదు చేసింది. తొలిసారిగా ప్రయాణికుల విభాగంలో ఆర్థిక సంవత్సరపు నెలవారీ ప్రయాణికుల ఆదాయంలో రూ.500 కోట్ల మార్కును, సరుకు రవాణాలో అత్యధికంగా 12.517 మిలియన్ టన్నులను నమోదు చేసింది.
ఈసందర్భంగా ద.మ.రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ ఈ విజయాలకు కారణమైన ఆపరేటింగ్, కమర్షియల్ టీంలను అభినందించారు. జోన్‌లో ప్రతీ నెల ఉత్తమ పని తీరు నమోదవడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. జోన్ మొత్తం పనితీరును మెరుగుపరచడానికి దారితీసిన అన్ని విభాగాల సిబ్బంది అద్భుతమైన సమన్వయాన్ని ఈ సందర్జంగా జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అభినందించారు.