Sunday, October 6, 2024

INDW vs SAW | రాణించిన సౌతాఫ్రికా… భార‌త్ టార్గెట్ ఎంతంటే

భార‌త – సౌతాఫ్రికా మద్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా నేడు జరుగుతున్న రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా మ‌హిళ‌ల జ‌ట్టు భారీ స్కోర్ నమోదు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు బాదింది.

సౌతాఫ్రికా ఓపెనర్ తజ్మిన్ బ్రిట్స్ (50) హాఫ్ సెంచరీతో చెలరేగింది. అన్నేకే బోష్ (40) సత్తా చాటింది. ఇక కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (22), మారిజాన్ కాప్ (20) ప‌రుగుల‌తో ఫర్వాలేదనిపించారు. దీంతో టీమిండియా ముందు దక్షిణాఫ్రికా జట్టు బలమైన లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. ఇప్పటికే తొలి టీ20 మ్యాచ్‌లో చివరి వరకు పోరాడి ఓడిన భారత జట్టు.. సిరీస్‌ను సమం చేసేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో విజ‌య‌మే ల‌క్ష్యంగా 178 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement