Friday, November 1, 2024

AUS vs SA | పోరాడి ఓడిన సౌతాఫ్రికా.. ఫైనల్స్ కు చేరిన ఆసీస్

ఐసీసీ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ లో భాగంగా ఇవ్వాల కోల్‌క‌తా వేదిక‌గా జ‌రిగిన రెండో సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా పై ఆస్ట్రేలియా విజ‌యం సాధించి ఫైన‌ల్‌కు దూసుకువ‌చ్చింది. ఈ క్ర‌మంలో అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఆదివారం (న‌వంబ‌ర్ 19న‌) జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్ జ‌ట్టుతో ఆస్ట్రేలియా త‌ల‌ప‌డ‌నుంది. 213 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆస్ట్రేలియా 47.2 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు వచ్చిన కంగారూలకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో ట్రావిస్ హెడ్ (62) హాఫ్ సెంచ‌రీ చేశాడు. స్టీవ్ స్మిత్ (30), డేవిడ్ వార్న‌ర్ (29), జోష్ జోష్ ఇంగ్లిస్ (25 నాటౌట్‌) లు రాణించారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో తబ్రైజ్ షమ్సీ రెండు వికెట్లు తీశాడు. కగిసో రబడ, మార్క్రామ్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్ లు ఒక్కొ వికెట్ తీశారు.

అంత‌క ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన ద‌క్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. డేవిడ్‌ మిల్లర్‌ (101; 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) శతకంతో చెల‌రేగాడు. హెన్రిచ్‌ క్లాసెన్‌ (47) రాణించ‌గా మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో ద‌క్షిణాఫ్రికా ఓ మోస్త‌రు స్కోరుకే ప‌రిమిత‌మైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌, కమిన్స్ చెరో మూడు వికెట్లు తీశారు. హేజిల్‌వుడ్‌, హెడ్ త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement