Saturday, October 26, 2024

BCCI | సౌతాఫ్రికా టూర్, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. భారత జట్లు ఇవే !

దక్షిణాఫ్రికా పర్యటనకు, ఆస్ట్రేలియాలో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి భారత జట్టును పురుషుల సెలక్షన్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. భారత్-దక్షిణాఫ్రికా మధ్య నవంబర్ 8నుంచి 4 మ్యాచ్‌ల టీ20-ఐ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో టీ20 జట్టు కోసం సూర్యకుమార్ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది.

దాంతో పాటు ఆస్ట్రేలియాతో నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-2025 సిరీస్ కోసం బీసీసీఐ భారత టెస్టు జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.

అయితే, చీలమండ గాయం కారణంగా టీమిండియా పేస్ బౌలర్ మహమ్మద్ షమీని తుది జట్టులో ఎంపిక చేయలేదు. ఇక తెలుగు తేజం ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చోటు దక్కించుకున్నాడు. అతనితో పాటు అభిమన్యు ఈశ్వరన్ కూడా తుది జట్టులోకి వచ్చాడు. వీరిద్దరినీ భారత టెస్టు జట్టు పిలవడం ఇదే తొలిసారి.

- Advertisement -

టీమిండియా టీ20ఐ జ‌ట్టు :
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్), రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వైషాక్, అవేష్ ఖాన్, యష్ దయాళ్.

షెడ్యూల్ :
మొద‌టి టీ20ఐ – నవంబర్ 08వ‌తేదీ – డర్బన్
రెండో టీ20ఐ – నవంబర్ 10వ‌తేదీ గెబెర్హా
మూడో టీ20ఐ – నవంబర్ 13వ‌తేదీ – సెంచూరియన్
నాల్గో టీ20ఐ – నవంబర్ 15వ‌తేదీ – జోహన్నెస్‌బర్గ్.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి భారత జట్టు :
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీప‌ర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, మహ్మద్. సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.

రిజర్వ్‌లు : ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్

షెడ్యూల్ :
1వ టెస్ట్ నవంబర్ 22వ‌తేదీ నుంచి 26వ‌తేదీ వ‌ర‌కు : పెర్త్ స్టేడియం, పెర్త్
2వ టెస్ట్ డిసెంబర్ 06వ‌తేదీ నుంచి 10వ‌తేదీ వ‌ర‌కు : అడిలైడ్ ఓవల్
3వ టెస్ట్ డిసెంబర్ 14వ‌తేదీ నుంచి 18వ‌తేదీ వ‌ర‌కు : గబ్బా, బ్రిస్బేన్
4వ టెస్టు డిసెంబర్ 26వ‌తేదీ నుంచి 30వ‌తేదీ వ‌ర‌కు : MCG, మెల్బోర్న్
5వ టెస్టు జనవరి-03వ‌తేదీ నుంచి 07వ‌తేదీ వ‌ర‌కు: SCG, సిడ్నీ

Advertisement

తాజా వార్తలు

Advertisement