భారత్ – సౌతాఫ్రికా మహిళల జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీసలో భాగంగా నేడు జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో సిరీస్‌లోని తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా… సౌతాఫ్రికా బౌలర్లను ఉతికారేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (117) విధ్వంసక ఇన్నింగ్స్‌తో మెరుపు సెంచరీ బాదింది. చివర్లో ఆల్ రౌండర్లు దీప్తి శర్మ (37), పూజా వస్త్రాకర్ (31 నాటౌట్) రాణించారు. దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది.
అనంతరం డిఫెండింగ్‌లోనూ అద్భుతంగా రాణించింది. భారీ టార్గెట్‌తో చేజింగ్‌కు దిగిన సౌతాఫ్రికా భారత బౌలర్ల ధాటికి 122 పరుగులకే కుప్పకూలింది. సునే లూయస్ (33), మారిజానే కాప్ (24), సినాలో జాఫ్తా (27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత్ బౌలర్లలో ఆశా శోభన వికెట్లతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఇక దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టగా… రేణుకా సింగ్ ఠాకూర్, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.