Saturday, November 23, 2024

అంతర్జాతీయ క్రికెట్‌కు డేల్ స్టెయిన్ రిటైర్మెంట్

ప్రపంచంలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్, దక్షిణాఫ్రికా ఆటగాడు డేల్ స్టెయిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్‌ నుంచి తప్పుకోవడం కొంత బాధగా ఉన్నా ఈ నిర్ణయం తప్పడం లేదని అతడు ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. దీంతో తన 20 ఏళ్ల కెరీర్ నేటితో ముగిసిందని తెలిపాడు. ఇన్నేళ్ల కాలంలో శిక్షణ, మ్యాచ్‌లు, ప్రయాణాలు, అలసట, విజయాలు, పరాజయాలు, ఆనందాలు, సోదర ప్రేమ ఇలాంటివి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని, ఎంతోమందికి కృతజ్ఞతలు చెప్పాలని స్టెయిన్ పేర్కొన్నాడు.

ఒకప్పుడు వరల్డ్ నెంబర్ వన్ బౌలర్‌గా కొనసాగిన స్టెయిన్ గాయాల బారిన పడ్డాడు. పలు సర్జరీల అనంతరం ఆటలో మళ్లీ అడుగుపెట్టినా, మునుపటి వాడి లోపించింది. దానికితోడు గాయాలు తిరగబెట్టడం కూడా స్టెయిన్ ప్రతిష్ఠను మసకబార్చింది. ఈ నేపథ్యంలోనే అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించినట్టు తెలుస్తోంది.

38 ఏళ్ల స్టెయిన్ తన కెరీర్‌లో 93 టెస్టులాడి 439 వికెట్లు సాధించాడు. వాటిలో అత్యుత్తమం 7/51. వన్డేల్లో 125 మ్యాచ్ లాడి 196 వికెట్లు, టీ20 అంతర్జాతీయ పోటీల్లో 47 మ్యాచ్ ల్లో 64 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ తోనూ స్టెయిన్ కు అనుబంధం ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్, డెక్కన్ ఛార్జర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

YouTube video

ఈ వార్త కూడా చదవండి: ప్రొ.కబడ్డీ వేలం.. ప్రదీప్ నర్వాల్‌కు రూ.1.65 కోట్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement