భారత మాజీ కెప్టన్ సౌరభ్ గంగూలీ ఇంట్లో దొంగతనం జరిగింది. కోల్కతాలోని బెహలాలో ఉన్న గంగూలీ ఇంట్లో చొరబడి రూ.1.6 లక్షల విలువైన ఫోన్ ను దుండగులు ఎత్తుకెళ్లారు. దాదా ఇంట్లోని ఒక ప్లేస్లో ఫొన్ దాచి పెట్టిన గంగులీ బయటకు వెళ్లి.. తిరిగి వచ్చి చూసే సరికి అక్కడ ఫోన్ కనపడలేదు. వెంటనే గంగూలీ సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫోన్లో వ్యక్తిగత సమాచారం ఉందని, దాన్ని దుర్వినియోగం చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ మధ్యే గంగూలీ ఇంటికి పెయింటింగ్ వేశారు.. పెయింటింగ్ వేసిన వాళ్లలో ఎవరో ఒకరు అతడి ఫోన్ను కాజేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకని వాళ్లను పిలిపించి విచారిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement