Thursday, September 5, 2024

TG | త్వరలోనే సెమీ అండ్ రెసిడెన్షియల్ పాఠశాలలు : భట్టి విక్రమార్క

ఎడ్యుకేషన్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. డే స్కూల్ కాకుండా సెమీ అండ్ రెసిడెన్షియల్ పాఠశాలలు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయని ప్రకటించారు. ఈరోజు (మంగళవారం) తెలంగాణ సచివాలయంలో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ…

ఇప్పుడున్న ప్రభుత్వ విద్యకంటే నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని…. ఒక్కో పాఠశాల కోసం రూ.80 నుంచి రూ.100 కోట్లు ఖర్చు చేయబోతున్నామని అన్నారు. ఒక్రేజ్, బిర్లా ఓపెన్ స్కూల్స్ టైప్ ప్రభుత్వ పాఠశాలలు రాబోతున్నాయని చెప్పారు. ప్రతీ మండలానికి రెండు లేదా మూడు పాఠశాలలు తొలుత రాబోతున్నాయని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement