Saturday, November 23, 2024

రష్యాకు సోనీ షాక్‌.. ఆంక్షలు విధించిన దిగ్గజ కంపెనీలు

ఉక్రెయిన్‌-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో యూరప్‌దేశాలపాటు వ్యాపార దిగ్గజ కంపెనీలు రష్యామీద ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా సోనీ పిక్చర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ రష్యాలో తమ వ్యాపార కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సోనీ పిక్చర్స్‌ చైర్మన్‌, సీఈవో టోనీ ఈవిషయాన్ని తెలిపారు. రష్యాలో సోనీకి చెందిన క్రంచీరోల్‌ యానిమ్‌ స్ట్రీమింగ్‌ సేవలను నిలిపివేయడంతోపాటు పలు టీవీ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలు కూడా నిలిపివేసింది.

ఇప్పటికే రష్యాలో విడుదల కాకుండా మోర్బియస్‌ చిత్రాన్ని నిలిపివేసింది. కాగా గతవారం సోనీగ్రూప్‌ ఉక్రెయిన్‌ ప్రజలను ఆదుకునేందుకు ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్‌ (యుఎన్‌హెచ్‌సీఆర్‌), అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ సేవ్‌ది చిల్డ్రన్‌కు 2మిలియన్‌ డాలర్ల విరాళాన్ని ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement