కరోనా కష్టకాలంలో సోనూసూద్ తన సేవలను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా బెంగళూరులోని ఆర్క్ హాస్పిటల్ లో ఆక్సిజన్ నిండుకోగా, విషయం తెలుసుకున్న సోనూ, తన టీమ్ ను అలర్ట్ చేసి, రాత్రంతా శ్రమించి, 22 ప్రాణాలను కాపాడారు. ఈ విషయాన్ని బెంగళూరు, యహలంక పాత బస్తీ ఇనస్పెక్టర్ సత్యనారాయణ సోనూ సూద్ దృష్టికి తీసుకుని వెళ్లారు. విషయాన్ని సోనూ నిర్వహిస్తున్న చారిటబుల్ ట్రస్ట్ కు ఆయన చెప్పగానే, పరిస్థితిని అర్థం చేసుకున్న ఆయన, వెంటనే టీమ్ ను అలర్ట్ చేశారు. అప్పటికే ఆక్సిజన్ కారణంగా ఆసుపత్రిలో ఇద్దరు బాధితులు కన్నుమూయగా, మిగతావారిని కాపాడాలన్న ఆదేశాలు అందాయి. దీంతో గంటల వ్యవధిలోనే సోనూ టీమ్ 15 ఆక్సిజన్ సిలిండర్లను అందించింది.
సత్యనారాయణ నుంచి కాల్ రాగానే, మేము దాన్ని వెరిఫై చేశామని… నిజమని తెలియగానే నిమిషాల వ్యవధిలో పని మొదలైంది. రాత్రంతా ఆసుపత్రికి ఆక్సిజన్ ను అందించేందుకు శ్రమించాం. మేము ఆలస్యం చేసుంటే ఎన్ని ప్రాణాలు పోయుండేవో తెలియదు. ఈ ఆపరేషన్ ను విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలని అన్నారు సోనూసుద్.