సోనూసూద్..దేశవ్యాప్తంగా ఈ పేరుకున్న చరిష్మా అంతఇంతా కాదు…లాక్ డౌన్ సమయంలో వలసకూలీలకు అండగా నిలిచాడు.. కరోన సమయంలో ఆపదలో ఆదుకున్న సోనూసుద్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓ ఐడల్ గా మారాడు. దీంతో సోనూసుద్ కి దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తున్న సంగతి తెలిసిందే. విపత్తు సమయంలో సోనూ చేసిన సేవా కార్యక్రమాలకు అభినందనలతో పాటుగా.. పలు అవార్డులు ఆయనకు దక్కాయి. అయితే తాజాగా సోనూసూద్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. వచ్చే ఏడాది రష్యాలో జరగబోయే స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్‌కు భారత్ తరపున సోనూసూద్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. రష్యాలోని కజాన్ వేదికగా వచ్చే ఏడాది జనవరి 22 నుంచి స్పెషల్ వింటర్ ఒలింపిక్స్ జరుగనున్నాయి. ఈ వింటర్ ఒలింపిక్స్‌కు హాజరయ్యే భారతదేశం అథ్లెట్ల బృందానికి సోనూ నాయకత్వం వహించ నున్నారు.
దీనిపై సోనూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ రోజు తనకు చాలా ప్రత్యేకమైన రోజని, స్పెషల్ ఒలింపిక్స్ భారత్ బృందంతో చేరడం తనకు గర్వంగా ఉందన్నారు. ఈ సందర్బంగా ఎస్‌వో భారత్ జట్టుకు ముందస్తు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అటు ఈ పరిణామంపై ప్రత్యేక ఒలింపిక్స్ భారత్ ఛైర్‌పర్సన్ డాక్టర్ మల్లికా నడ్డా సంతోషం ప్రకటించారు. ప్రత్యేక ఒలింపిక్స్ కుటుంబంలో చేరేందుకు తమ ఆహ్వానాన్ని మన్నించిన సోనూ సూద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయంలో ఆయన కీలక పాత్ర పోషించనున్నాడని నమ్ముతున్నామన్నారు.