డా.రాజశేఖర్ నటిస్తున్న చిత్రం ‘శేఖర్’. జీవిత దర్శకురాలు. స్క్రీన్‌ప్లే కూడా ఆమె సమకూర్చారు. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమా మొదటి పాటను విడుదల చేశారు. ”ఒరేయ్ నీ లవ్ స్టోరీ ఒకటి చెప్పురా…” అనే వాయిస్ ఓవర్‌తో పాట మొదలవుతుంది. అనూప్ రూబెన్స్ స్వరానికి చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ పాటని విజయ్ ప్రకాష్, అనూప్, రేవంత్ సంయుక్తంగా ఆలపించారు.
”లవ్ గంటే మోగిందంట….” అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియోలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో రాజశేఖర్ ఆహార్యం ఆయన గత సినిమాలకు భిన్నంగా ఉంది. మల్లికార్జున్ నరగని కెమెరా విజువల్స్ కొత్తగా కనిపించేలా చేశాయి. ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ ” ఇప్పటికె విడుదల చేసిన ప్రచార చిత్రాలు, ఫస్ట్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ సింగల్ కూడా అదే స్థాయిలో అలరిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి” అని అన్నారు.
డా. రాజశేఖర్, ఆత్మీయ రజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, తనికెళ్ళ భరణి, రవి వర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన: లక్ష్మీ భూపాల్, ఛాయాగ్రహణం: మల్లికార్జున్ నరగని, సంగీతం: అనూప్ రూబెన్స్.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital