Friday, November 22, 2024

సొనాలి ఫొగట్ డెత్‌ రిపోర్ట్‌.. బలవంతంగా డ్రగ్స్‌ తాగించడం వల్లే చనిపోయింది

హర్యానాకు చెందిన బీజేపీ నేత సొనాలి ఫొగట్‌కు తన ఇరువురు సహాయకులు మత్తు పదార్థాలను బలవంతంగా తాగించడం వల్లనే చనిపోయినట్లు గోవా పోలీసులు తెలిపారు. ఇరువురు కూడా నిందితులుగా ఉన్నారని చెప్పారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా ఇరువురు నిందితులు సుధీర్‌ సంగ్వాన్‌, అతని సహాయకుడు సుఖ్విందర్‌ సింగ్‌ బాధితురాలితో క్లబ్‌లో గడిపినట్లు కూడా నిర్ధారణ అయినట్లు ఐజిపి ఓంవీర్‌ సింగ్‌ బిష్ణోయ్‌ తెలిపారు. ఫొగట్‌ను ఇరువురు ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఆగస్టు 22న గోవాకు తీసుకొచ్చినట్లు చెప్పారు. వారి పథకం ప్రకారం ఇరువురు ఉద్దేశ్యపూర్వకంగా ఫొగట్‌కు అసహజ రసాయనిక మత్తు పదార్థాన్ని శీతల పానీయంలో కలిపి ఇచ్చి.. బలవంతంగా తాగించినట్లు చెప్పారు. సొనాలి ఫొగట్‌ సోదరుడు రింకు ఢాకా ఫిర్యాదు మేరకు తన సోదరి ఆస్తులను, డబ్బులను కాజేయాలనే ఇరువురు కావాలనే హత్యకు పాల్పడ్డారని ఆరోపించాడు.

ఈ తంతంగం అంతా నార్గ్‌ గోవాలోని కర్లీస్‌ రెస్టారెంట్‌లో జరిగింది. సొనాలి ఫొగట్‌కు బలవంతంగా రసాయనిక మత్తు పదార్థాన్ని తాగించి, ఇరువురు హోటల్‌కు తీసుకెళ్లారు.. ఆమె ప్రాణపాయ స్థితిలో వెళ్లిన తర్వాత సెయింట్‌ ఆంథోని హాస్పిటల్‌కు తీసుకెళ్ళారు.. అప్పటికే ఆమెచనిపోయినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని ఐజిపి తెలిపారు. తమ సోదరికి డ్రగ్‌ ఇచ్చిన తర్వాత తన సహాయకుడు అత్యాచారానికి సైతం పాల్పడ్డారని ఇది పథకం ప్రకారమే జరిగిందని.

షూటింగ్‌ కోసం అంటూ ఆగస్టు 24న జరగాల్సిన షూటింగ్‌ డేట్‌ కంటే ముందే 21, 22న గోవాలో రూమ్‌లు బుక్‌ చేసుకున్నట్లు చెప్పారు. వీరిరువురికి గోపాల్‌ఖండ్‌ అనే వ్యక్తి సహకరించినట్లు రింకు ఆరోపించాడు. పోస్టుమార్టం రిపోర్టులో ఆమె మత్తు మందు కలిగి ఉండటమే కాక శరీరంపై గాయాలు కూడా ఉన్నట్లు తేలింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఇది హత్యకేసుగా పోలీసులు నమోదు చేశారు. శుక్రవారం సొనాలి ఫొగట్‌ అంత్యక్రియలు హర్యానలోని హిసర్‌లో నిర్వహించారు. బాధితురాలు 2019లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement