Tuesday, November 26, 2024

Crime: కన్నతల్లిని కడతేర్చిన కొడుకు.. ఆపై ఆత్మహత్యయత్నం

రుచికరమైన ఆహారం పెట్టలేదని తల్లితో కొడుకు గొడవ పడ్డాడని, తీవ్ర ఆగ్రహంతో మెడపై కొడవలితో దాడి చేశాడని పోలీసులు మంగళవారం వెల్లడించారు. అక్కడికక్కడే ఆమె కుప్పకూలిందని తెలిపారు. అనంతరం నిందితుడు ఆత్మహత్యకు యత్నించి నిద్రమాత్రలు మింగాడని చెప్పారు.

చుట్టుపక్కల వారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నామని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. నిందితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, ఇంకా అరెస్టు చేయలేదని ప్రకటించారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302(హత్య) కింద సోమవారం కేసు నమోదు చేసినట్లు వివరించారు. ముర్బాద్ తాలూకాలోని వేలు గ్రామంలో ఈ దారుణ జరిగిందని థానే రూరల్ పోలీస్ కంట్రోల్ రూమ్ అధికారి ఒకరు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement