Tuesday, November 26, 2024

అత్యాచారానికి గురయ్యా: నటి సోమీ అలీ

బాలీవుడ్‌లో నటి సోమీ అలీ సంచలన విషయాలు బయటపెట్టింది. పాకిస్థాన్‌లో ఉన్నప్పుడు తాను 5, 9 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురయ్యానని, 14 ఏళ్ల వయసులో అత్యాచార బాధితురాలిగా మారానని వెల్లడించింది .పాకిస్థాన్ నుంచి వచ్చి బాలీవుడ్‌లో కాలుమోపిన నటి సోమీ అలీ. 1990లలో తన నటనతో ఆకట్టుకుంది.ప్రస్తుతం నో మోర్టి యర్స్ అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తోంది. అత్యాచార బాధితులను, లైంగిక వేధింపులకు గురయ్యే పిల్లలను రక్షిస్తున్న ఆమె తన జీవితానికి సంబంధించి సంచలన విషయాలను వెల్లడించింది.

ఈ విషయం బయటపెట్టడానికి ఇంతకాలం పట్టిందని సోమీ చెప్పుకొచ్చింది. ఓ ఎన్జీవోను నడుపుతూ ఇప్పటికీ ఈ విషయం చెప్పకపోతే మోసం చేసినట్టు అవుతుందనే వెల్లడించినాని అని ఆమే తెలిపింది. తొలిసారి పాకిస్థాన్‌లో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా. అప్పుడు నా వయసు ఐదేళ్లు. పనివాళ్ల క్వార్టర్స్‌లో ఇలాంటి ఘటనలు మూడుసార్లు జరిగాయి. నేను మా అమ్మా, నాన్నకు చెప్పా. చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత ఈ విషయాన్ని బయట ఎక్కడా చెప్పకు అని నన్ను మందలించారు. అయితే, అవే ఆలోచనలు నా మెదడును నాలుగేళ్ల పాటు పట్టి పీడించాయి. నేనేమైనా తప్పు చేస్తున్నానా? అమ్మానాన్నలు ఎందుకలా చెప్పారు? అని అనుకున్నా. ఇండియా, పాకిస్థాన్‌లో సంప్రదాయాలు ఒకేలా ఉంటాయి. వారు నన్ను రక్షిస్తున్నా, నేను అర్థం చేసుకోలేకపోయాను. మళ్లీ అలాంటి ఘటనే 9 ఏళ్ల వయసులో జరిగింది. ఆ తర్వాత మరోసారి 14 ఏళ్ల వయసులో అని సోమీ అలీ వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement