Thursday, December 12, 2024

Something ….. ఈ జింక శున‌కంలా మొరుగుతుంది

రెయిన్ డీర్ ప్ర‌త్యేక‌త ఇదే
ఛ‌త్తీస్‌గ‌ఢ్ అడ‌వుల్లో అరుదైన జింక‌
ట్రాప్ కెమెరాల‌కు చిక్కిన ఆధారాలు
అరుదైన‌ జాతిగా పేర్కొన్న టైగ‌ర్ రిజ‌ర్వ్ డిప్యూటీ డైరెక్ట‌ర్ అరుణ్ జైన్‌

ఛత్తీస్​గఢ్ అడవుల్లో అరుదైన మొరిగే జింక కెమెరాకు చిక్కింది. ధమ్​తరీ, గరియాబంద్ జిల్లాల సరిహద్దులోని ఉదంతి సీతానంది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్​లో ఈ జింక కనిపించింది. ఇది అరుదైన వన్యప్రాణి అని టైగర్ రిజర్వ్ డిప్యూటీ డైరెక్టర్ అరుణ్ జైన్ తెలిపారు. శునకం మాదిరిగా అరుస్తూ శబ్దాలు చేసే ఈ జింక రెయిన్​ డీర్ జాతికి చెందినదని వివరించారు. సాధారణ జింకలతో పోలిస్తే దీని శరీరం కాస్త భిన్నంగా ఉంటుంది.

జింక‌ల్లోనూ ప‌లు ర‌కాలు..

మౌన్​జాక్ డీర్, ఇండియన్ కాకడ్, బార్కింగ్ డీర్ (మొరిగే జింక), కోట్రి వంటి వివిధ పేర్లతో జింక‌ల‌ను పిలుస్తారని అరుణ్ జైన్ తెలిపారు. భారత్ సహా దక్షిణాసియాలో ఇలాంటివి ఎక్కువగా క‌నిపిస్తాయ‌ని వెల్లడించారు. వాటిలో ఒక జాతికి చెందిన జింకలు భారత్​లోనూ ఉంటాయి కాబట్టి, వాటికి ఇండియన్ కాకడ్ అనే పేరు వచ్చిందన్నారు. కెమెరా కంటికి చిక్కిన ఈ మొరిగే జింక వీడియోను ఉదంతి సీతానంది టైగర్ రిజర్వ్ తమ​ సోషల్ మీడియా హ్యాండిల్​లో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్​గా మారింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement