ఇజ్రాయిల్ దేశానికి చెందిన కొందరు శాస్త్రవెత్తలు.. ఈ రకం ప్రయోగాన్ని చేపట్టారు. కృత్రిమంగా పిండం తయారు చేయడమోలాగో వీరు ఆవిష్కరించారు. ఈ పద్దతిలో పురుషుల వీర్యంతో అసలు సంబంధమే ఉండదు. స్త్రీ కడుపు పండాలంటే.. స్త్రీ, పురుషుల కలయిక తప్పనిసరి అనేది ఒకప్పటి మాట. ఒకప్పుడు అందరికీ సాధారణంగా పిల్లలు ఇలానే పుట్టేవారు. కానీ.. మారుతున్న కాలాని తగినట్లు.. సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నవారు పెరిగిపోతున్నారు. ఈ క్రమంలో రకరకాల చికిత్సలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. కలయికతో సంబంధం లేకుండా.. ఐవీఎఫ్ పద్దతి ద్వారా కూడా చాలా మంది పిల్లలకు తల్లిదండ్రులు అవుతున్నాయి. అయితే.. ఈ పద్దతిలో.. శృంగారంతో సంబంధం లేకపోయినా… పురుషుల వీర్యం, స్త్రీ అండం తప్పనిసరి. అయితే.. తాజాగా చేసిన ఓ పరిశోధనలో.. అసలు పురుషుల వీర్యం లేకుండా.. పిండాన్ని అభివద్ధి చేశారు.
నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. ఇజ్రాయిల్ దేశానికి చెందిన కొందరు శాస్త్రవెత్తలు.. ఈ రకం ప్రయోగాన్ని చేపట్టారు. కృత్రిమంగా పిండం తయారు చేయడమోలాగో వీరు ఆవిష్కరించారు. ఈ పద్దతిలో పురుషుల వీర్యంతో అసలు సంబంధమే ఉండదు. పురుషుల వీర్యంతో ఎలాంటి సంబంధం లేకుండా.. కృత్రిమ పిండాన్ని సృష్టించారు.
మరో విచిత్రం ఏమిటంటే.. ఈ కృత్రిమ పిండాన్ని తల్లి గర్భం కూడా అవసరం లేకపోవడం గమనార్హం. ఓ చిన్న పాత్రలో ఓ సింథటిక్ పొరను ఏర్పరిచి.. అందలోనే తల్లి గర్భంలోని వాతావరణాన్ని రూపొందించి.. కేవలం రక్త కణాలతోనే ఓ పిండాన్ని అభివృద్ధి చేశారు. ఇందులోనే కణజాలం వృద్ధి చెందడంతో పాటు.. శరీర భాగాలు కూడా ఏర్పడ్డాయని శాస్త్రవెత్తలు తెలియజేశారు. తాము చేసిన ఈ ప్రయోగానికి వీర్య కణాలతో కూడా సంబంధం లేదని చెప్పారు. ఇలా తల్లి గర్భం, తండ్రి వీర్యంతో సంబంధం లేకుండా కృత్రిమ పిండం రూపొందించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా… మానవ కణజాలాన్ని, శరీర భాగాలను కృత్రిమ తయారు చేయడానికిఈ ప్రయత్నం ఉపయోగపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.