ఆరోగ్యబీమా కుటుంబాలకు ఆర్థికంగా భరోసా ఇస్తుంది. వైద్య చికిత్సలు అవసరమైనప్పుడు ఆసుపత్రి ఖర్చులు, అంబులెన్స్ ఖర్చులు, నర్సింగ్, రూమ్ రెంట్‌లు, మందుల బిల్లులు ఇలా పలు ప్రయోజనాలు ఇందులో పొందుపరుసు . ఆరోగ్య బీమా తీసుకోవడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అప్పుడు తిరష్కరణకు గురికాకుండా ఉంటాయని బజాబ్ అలయజ్జ్ జనరల్ ఇన్సూరెన్స్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ హైడ్ భాస్కర్ నీరుకర్ తెలిపారు.
రెన్యూవల్‌తో మేలు
మార్కెట్‌లో అందుబాటులో ఉన్న చాలా ఆరోగ్య బీమా పాలసీలు కాలపరిమితితో జారీ చేస్తున్నారు. వీటి కాలపరిమితి తీరిన తరువాత రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది రెన్యూవల్ విషయం మరిచిపోతుంటారు. పాలసీ గడువు తీరిన తరువాత చాలా కంపెనీలు 15 రోజుల వరకు యధావిధిగా రెన్యూవల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారని ఆయన వివరించారు. పాలసీ గడువు ముగిసిన తరువాత ఎలాంటి క్లైయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. సమయానికి రెన్యూవల్ చేసుకోవడం వల్ల కొన్ని అదనపు ప్రయోజనాలను కంపెనీలు కల్పిస్తుంటాయి.
వెల్లడించాల్సిన విషయాలు
పాలసీ తీసుకునే ముందు ఉన్న నిబంధనలను జాగ్రత్తగా అనుసరించాల్సి ఉంటుందని చెప్పారు. పాలసీ తీసుకోవడానికి ముందున్న ఆరోగ్య సమస్యల గురించి తెలియచేయాల్సి ఉంఉంది. చాలా మంది ఈ విషయంలో పొరపాట్లు చేస్తుంటారని, ఇది పాలసీ క్లైయిమ్ చేసే సమయంలో ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు.
అమల్లోకి వచ్చే సమయం
ఆరోగ్య బీమా పాలసీల్లో అది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో కంపెనీలు తెలియ చేస్తాయి. కొన్ని జబ్బులకు వర్తించే కాలపరిమితి ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు ఉండవచ్చు. ఈ సమయం గురించి పాలసీ తీసుకున్న వారు జాగ్రత్త గా పరిశీలిం చాల్సి ఉంటుంది. లేకుంటే చికిత్స పూర్తయిన తరువాత క్లైయిమ్ తిరష్కరణకు గురయ్యే అవకాశం ఉంటుం దని చెప్పారు. ఇలా కాకుండా ఉండాలంటే పాలసీలో ఉన్న నిబంధనలపై అవగా హన అవసర మని వివరించారు. అన్ని ఆరోగ్య బీమా పాలసీలు అందిస్తున్న కంపెనీలు వర్తించే జబ్బులు, వర్తించని వాటి జాబితాను ఇస్తున్నాయి. వీటిని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.
క్లైయిమ్ ఎప్పుడు చేసుకోవచ్చు
సాధారణంగా చికిత్స పూర్తయిన తరువాత 60 నుంచి 90 రోజుల్లోగా క్లైయిమ్ చేసుకోవచ్చు. సాధ్యమైనంత త్వరగా సంబంధిత కంపెనీకి క్లైయిమ్ కోసం అపీల్ చేసుకోవాలని ఆయన సూచించారు.
కావాల్సిన డాక్యుమెంట్స్
క్లైయిమ్ చేసుకో వడానికి వీలుగా పాలసీదారు డు చికిత్సకు సంబంధిం చిన అన్ని ఒరిజినల్ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. బిల్లులు, మందుల చీటీలు, డాక్టర్ కన్సల్టేషన్ పత్రాలు, టెస్ట్ రిపోర్టులు.. అన్ని పత్రాలను సమర్పిస్తేనే క్లైయిమ్ తిరష్కరణకు గురికాకుండా ఉంటుందని భాస్కర్ వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.