Friday, November 22, 2024

కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు…. శభాష్ !!

కరోనా విజృంభిస్తోన్న వేళ మృతుల అంత్యక్రియలకూ అగచాట్లు తప్పడం లేదు. మహమ్మారి భయంతో అయినోళ్లే దగ్గరికి రాని పరిస్థితులు ఉన్నాయి. మనిషి ఆఖరి మజిలీకి అయిన వారు కూడా రాని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో చింతలమోరి గ్రామ సర్పంచ్, యువ డాక్టర్ రాపాక రమేష్ బాబు ఆధ్వర్యంలో గల పింక్ హార్ట్స్ సేవాసంస్థ సభ్యులు ఒక టీం గా ఏర్పడి కరోనా తో మరణించిన మృత దేహాలకు అంత్యక్రియలు చేస్తూ మానవత్వం చాటుకుంటున్నారు.

మృతుల మతాచారాలకు అనుగుణంగా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా కరోనా బారినపడిన వారికి వైద్య సహాయం అందిస్తూ, వివిధ రకాల డ్రైప్రూట్స్ తో కూడిన పౌష్టికాహారం అందిస్తున్నారు. నియోజకవర్గంలోని రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో డాక్టర్ రాపాక రమేష్ బాబు నేతృత్వంలో మట్టా పృద్విరాజ్, రాపాక మహేష్, కుసుమ చింటు, కానూరి బాబి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పగలు, రాత్రి తేడాలేకుండా మరణించిన వారి కుటుంబీకుల అభ్యర్ధన మేరకు మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి చేస్తున్నారు. ఇప్పటి వరకూ సుమారు 30 మృత దేహాలకు అంతిమ సంస్కారాలు చేయడం గమనార్హం. పింక్ హార్ట్స్ సంస్థ సభ్యులు తమ ప్రాణాలకు తెగించి సామాజిక స్ర్పహతో చేస్తున్న సేవలను పలువురు అభినందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement