Monday, November 18, 2024

అబ్బాయి లేకుండా పెళ్లి… సోలోగామి, ఇదో కొత్త కాన్సెప్ట్

వివాహం.. ప్రతి ఒక్కరి జీవితంలో మధురానుభూతి. వధూవరులకు అతి పెద్ద పండుగ.. కానీ గుజ‌రాత్ కు చెందిన క్షమా బిందు అనే ఓ యువ‌తి వరుడు లేకుండానే పెల్లి చేసుకొబోతుంది.. అదెలా అంటారా.! సోలోగామి అనే ఓ కొత్త‌ కాన్సెప్ట్ తో త‌న‌ను తానే పెల్లి చేసుకోవ‌డానికి స‌ద్ధం అయింది బిందు.. దీంతో భార‌త దేశంలోనే స్వీయ‌-వివాహం చేసుకునే మొద‌టి అమ్మాయిగా పేరు తెచ్చుకుంది ఈ క్షమా బిందు..

“నేను పెళ్లి చేసుకోవాలి అని ఎప్పుడూ అనుకోలేదు.. కానీ నాకు పెళ్లికూతురు కావాలని ఆశ ఉండేది. అందుకే నన్ను నేనే పెళ్లి (సోలోగామి) చేసుకోవాలని నిర్ణయించుకున్నాను..” అంటూ ఈ నెల (జూన్) 11న తనను తాను వివాహం చేసుకోబోతున్న 24 ఏళ్ల క్షమా బిందు చెప్పింది. “మన దేశంలో స్వీయ-ప్రేమకు ఉదాహరణగా నిలిచిన మొదటి వ్యక్తి నేనే కావచ్చు” దీనికి ఉదాహరణగా నిలుస్తానని భావిస్తున్నట్లు తెలిపింది బిందు. కాగా.. గోత్రిలోని ఒక ఆలయంలో జరగబోయే త‌న‌ స్వీయ‌-వివాహ నిర్ణయాన్ని ఆమె తల్లిదండ్రులు కూడా అంగీక‌రించి ఆశీర్వదించారు. ఈ వేడుకలో ప్రతి హిందూ వివాహ సంప్రదాయం- ఫెరాస్, సిందూర్ దరఖాస్తు వంటిది ఉంటుంది. వివాహ ఆచారాలను అనుసరించి ఆమె తనతో రెండు వారాల హనీమూన్‌కు కూడా వెల్ల‌నుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement