భూమి వైపు ఓ భారీ సౌర తుఫాను దూసుకొస్తోంది. దీని కారణంగా సమాచార వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ నెల 3న ఓ భారీ సోలార్ ఫ్లేర్‌ను గుర్తించారు. ఇది భూ వాతావరణంవైపు చాలా వేగంగా దూసుకొస్తోంది. ఇది సూర్యుడి వైపు ఉన్న భూమిపై సబ్-సోలార్ పాయింట్‌లో కేంద్రీకృతమైనట్లు అమెరికాకు చెందిన స్పేస్ వెదర్ ప్రెడిక్షన్ సెంటర్ వెల్లడించింది. ఇది హైఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్‌ల బ్లాకౌట్‌కు కారణం కావచ్చని అంచనా వేసింది. ఓ గంట పాటు హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్ బ్లాకౌట్ జరిగే అవకాశం ఉందని తాజాగా ఈ స్పేస్ వెదర్ ప్రెడిక్షన్ సెంటర్ తెలిపింది. ఈ సౌర మంటలకు ఈ సెంటర్ ఎక్స్1 లెవల్‌గా గుర్తించింది.
అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా కూడా ఈ సౌర తుఫాను గురించి చెప్పింది. ఇది భూమి వైపు గంటకు 16 లక్షల కి.మీ. వేగంతో దూసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ వేగం మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్లు కూడా నాసా అంచనా వేసింది. దీని కారణంగా భూమి ఎగువ వాతావరణంలోని శాటిలైట్లపై ప్రభావం పడనుంది. ఇది నేరుగా జీపీఎస్ నేవిగేషన్ వ్యవస్థ, మొబైల్ ఫోన్ సిగ్నల్, శాటిలైట్ టీవీలపై ప్రభావం చూపుతుంది. ఈ సౌర మంటల కారణంగా పవర్ గ్రిడ్లపైనా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.
ఈ వార్త కూడా చదవండి: పెట్రోల్‌కు ప్రత్యామ్నాయం వచ్చేసింది