Sunday, November 17, 2024

గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ గంజాయి విక్రయిస్తున్న ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న కొండపనేని మాన్సీని విశాఖ జిల్లా అరకు నుంచి గంజాయి తెచ్చి హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి, నాచారం, మేడ్చల్‌, పంజాగుట్ట, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో విక్రయిస్తోందన్న సమాచారం అందడంతో పోలీసులు నిఘా పెట్టి ఆమెను మేడ్చల్‌ జిల్లా కొంపల్లిలో బోయిన్‌పల్లి పోలీసులు పట్టుకున్నారు. నాచారంలో ఉంటున్న మాన్సీని ఒక బహుళజాతి ఐటీ కంపెనీలో పని చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఉద్యోగం రీత్యా హైదరాబాద్‌లో ఉంటూ, గంజాయి విక్రయాలు సాగిస్తున్నట్లు పోలీసులు జరిపిన దర్యాప్తులో బయటపడింది. పోలీసులు పట్టుకున్న మాన్సీ భర్త మదన్‌ మనేకర్‌తో కలిసి గత రెండేళ్లుగా గంజాయి దందా నడిపిస్తున్నట్టు బోయిన్‌పల్లి పోలీసులు చెప్పారు.

మార్చి 12న ఈ దంపతులు మరో ఇద్దరు యువకులతో కలిసి గంజాయి అమ్ముతుండగా పోలీసులు పట్టుకునేందుకు వెళ్లారు. 1.2 కిలోల గంజాయితో యువకులిద్దరు పోలీసులకు చిక్కగా మాన్సీక, ఆమె భర్త పారిపోయారు. యువకులిద్దరు ఇచ్చిన సమాచారంతో గాలిస్తుంగా కొంపల్లి పోలీసులు మాన్సీని పట్టుకున్నారు. భోపాల్‌లో ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన మాన్సీ ఉద్యోగం చేసేందుకు హైదరాబాద్‌ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. మూడేళ్లుగా భర్తతో కలిసి ఆమె నాచారంలో ఉంటోందని స్థానిక ఏసీపీ నరేష్‌రెడ్డి తెలిపారు. మాన్సీ పూర్వీకులు తెలుగువారే. వారు చాలాకాలం కిందట మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో స్థిరపడినట్లు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement