దేశం కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. ఎప్పుడు ఎవరికి వైరస్ సోకిందో… ఎప్పుడు ఎవరి ఆరోగ్యం సీరియస్‌గా ఉందన్న వార్త వినాల్సి వస్తుందో అన్న భయం అందరినీ వెంటాడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ను ఏకైక ఆయుధంగా మేధావులు ముక్తకంఠంతో సూచిస్తున్నారు. కానీ కులగజ్జితో కొట్టుకునే మన జనం మాత్రం యధావిధిగా వ్యాక్సిన్ కు కూడా కులగజ్జి అంటించేశారు.
కరోనా వైరస్‌కు కోవాగ్జిన్ తయారు చేసిన స్వదేశీ సంస్థను సగర్వంగా పొగడాల్సింది పోయి అది మా కమ్మ వారి కంపెనీ. ఇప్పుడు మీ రెడ్లు ఆ వ్యాక్సిన్ ఎలా ఉపయోగిస్తారని ఒకడు, అది కమ్మ కంపెనీయే అయినా అందులో పనిచేసే సైంటిస్టులంతా రెడ్లేనని, రెడ్లు తయారు చేసిందే కోవాగ్జిన్ అని కొందరు సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు. మన దేశంలో కులగజ్జి ఉందని తెలుసు… అది రాజకీయాల వరకు ఉందని తెలుసు కానీ… ఇలా శాస్త్రవేత్తలకు కూడా అంటిస్తారని అనుకోలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.