Tuesday, November 26, 2024

మంత్రి పదవులతో సామాజిక న్యాయం.. కోనసీమలో వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశం

రామచంద్రాపురం, ప్రభ న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చాక తొలిసారి ప్రతిష్టాత్మకంగా రెండురోజుల పాటు నిర్వహిస్తున్న ప్లీనరీ సమావేశాలకు వైఎస్సార్సీపీ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ప్లీనరీలు నిర్వహిస్తోంది. ఆదివారం అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. వైసీపీ లోక్‌సభాపక్ష నేత, గోదావరి జిల్లాల ఇంఛార్జి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చింతా అనురాధ, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు జోగి రమేష్, విశ్వరూప్, ముమ్మిడివరం శాసన సభ్యులు పొన్నాడ సతీష్, కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, సీనియర్ నేతలు జక్కంపూడి విజయలక్ష్మి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్, కార్పొరేషన్, మున్సిపల్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు, వేల సంఖ్యలో కార్యకర్తలు ప్లీనరీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ పాలన, సంక్షేమ పథకాల అమలు, సామాజిక న్యాయం, రాష్ట్రాభివృద్ధి, చేరుకోవాల్సన లక్ష్యాలు వంటి అంశాలపై నాయకుల ప్రసంగాలతో సభా వేదిక దద్దరిల్లింది. గోదావరి జిల్లాల ఇంఛార్జి మిథున్ రెడ్డిని గజమాలతో సత్కరించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement