రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఈ రోజు ప్రారంభమైంది. డా. రెడ్డీస్ కు చెందిన సిబ్బంది అశోక్‌కు స్పుత్నిక్-వీ మొదటి డోసును వేశారు. డాక్టర్ రెడ్డీస్ భాగస్వామ్యంతో అపోలో గ్రూప్ ఆసుపత్రుల్లో వాక్సినేషన్ పైలెట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు.
హైదరాబాద్ తో పాటు విశాఖపట్నంలో కూడా ఏకకాలంలో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. వచ్చే నెల నుంచి దేశంలోనే స్పుత్నిక్-వీ వ్యాక్సిన్లను రెడ్డీస్ ల్యాబ్స్ ఉత్పత్తి చేయనుంది. కాగా, స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఇప్పటికే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దిగుమతి చేసుకున్న స్పుత్నిక్-వీ ఒక్కో డోస్ ధర రూ.995గా ఉంటుందని ఇప్పటికే ప్రకటన వచ్చింది. దేశంలో ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమయ్యాక దాని ధర తగ్గుతుంది.