Monday, December 23, 2024

Record | స్మృతి మంధాన ఖాతాలో మరో రికార్డు !

టీమ్ ఇండియా మహిళా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తన ఖాతాలో మరో రికార్డు నమోదు చేసుకుంది. మహిళల అంతర్జాతీయ క్రికెట్ లో… ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు (1602) చేసిన ప్లేయ‌ర్ గా రికార్డు సృష్టించింది. ప్ర‌స్తుతం వెస్టిండీస్ తో జ‌రుగ‌తున్న తొలి వ‌న్డే మ్యాచ్ లో 91 పరుగులు చేసిన స్మృతి మంధాన.. ఈ ఘ‌నత సాధించింది.

2024లో, అసాధారణ ఫామ్‌లో ఉన్న స్మృతి మంధాన.. దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్‌వార్డ్ (1593)ను అధిగమించి ఒక క్యాలెండర్ ఇయర్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచింది. అంతేకాకుండా ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో స్మృతి మంధాన మూడు సార్లు నిల‌వ‌డం విశేషం.

2024 – స్మృతి మంధాన – 1602 పరుగులు
2024 – లారా వోల్వార్డ్ట్ – 1593 పరుగులు
2022 – నాట్ స్సైవర్-బ్రంట్ – 1346 పరుగులు
2018 – స్మృతి మంధాన – 1291 పరుగులు
2022 – స్మృతి మంధాన – 1290 పరుగులు

Advertisement

తాజా వార్తలు

Advertisement