Saturday, November 23, 2024

సజావుగా వడ్ల కొనుగోళ్లు.. గత సీజన్​ కంటే ఈసారి దిగుబడి ఎక్కువే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. గత సంవత్సరం వానాకాలంలో ఇదే రోజు తో పోల్చుకుంటే ప్రస్తుతం 83వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని అధికంగా ధాన్యం సేకరించామని వెల్లడించారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై మంగళవారం మినిస్టర్‌ క్వార్టర్స్‌లోని తన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాల్లో మాయిశ్చర్‌ మిషన్లు, ప్యాడీక్లీనర్లు, గన్నీబ్యాగులు సరిపడినన్నీ అందుబాటులో ఉన్నాయని వివరించారు. సోమవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1, 32, 989 మంది రైతుల నుంచి 8.93 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించామని వెల్లడించారు ఇందుకోసం 2.23కోట్ల గన్నీలను వినియోగించామన్నారు. పూర్తిస్థాయిలో ధాన్యం సేకరణకూ గన్నీల కొరత లేదన్నారు. నవంబరు, డిసెంబరు మాసాల్లో ఈ వానాకాలం ధాన్యం సేకరణ విస్తృతంగా కొనసాగనుందన్నారు.

- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా కోత లకు అనుగుణంగా 4579 కొనుగోలు కేంద్రాలను ఇప్పటి వరకు తెరిచామన్నారు. అవసరం మేరకు మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగాలను ఆదేశించినట్లు వివరించారు. ఎఫ్‌సీఐ ప్రమాణాల మేరకు రైతులు ఫెయిర్‌ యావరేజ్‌ క్వాలిటీతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. ఎఫ్‌ఏ క్యూ వచ్చిన ధాన్యాన్ని వెంటనే సేకరిస్తారని స్పష్టం చేశారు. దేశంలో కేవలం తెలంగాణ రాష్ట్ర ం మాత్రమే ఏ గ్రేడ్‌ ధాన్యానికి రూ.2060, సాధారణ రకానికి రూ.2040 కనీస మద్దతు ధర చెల్లించి ధాన్యం సేకరిస్తోందని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ క మిషనర్‌ వీ. అనిల్‌ కుమార్‌, డిప్యూటీ కమిషనర్‌ రుక్మిణి, పౌరసరఫరాల సంస్థ జీఎం రాజారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement