Sunday, November 24, 2024

Smart Scheme: 9.74 లక్షల మంది విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు.. 100 రోజుల కార్యాచరణ

ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9.74 లక్షల మంది విద్యార్థులకు టాబ్లెట్‌లు, స్మార్ట్ ఫోన్‌లను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. దీన్ని 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో చేర్చాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగానికి సీఎం యోగి ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్ -19 మహమ్మారి కారణంగా యువత పాఠశాలలు, కళాశాలలకు వెళ్లలేని కారణంగా రెండేళ్లుగా వారి చదవులు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో యువత చదువులకు ఆటంకం కలగకుండా చూసేందుకు ప్రభుత్వం ఆన్‌లైన్ విద్యను ప్రారంభించింది. అయితే చాలా మందికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తెలియకపోవడంతో ఆన్లైన్ స్టడీస్ కూడా సరిగా జరగడం లేదు.

కాగా, యూపీలోని బీజేపీ ప్రభుత్వం తన సంకల్ప్ పత్రలో 2 కోట్ల మంది యువతకు ట్యాబ్లెట్‌లు, స్మార్ట్ ఫోన్‌లను అందించి వారిని సాంకేతికంగా డెవలప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం తన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో తొలివిడతగా 9.74 లక్షల టాబ్లెట్‌లు, స్మార్ట్ ఫోన్‌లను అందజేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన సన్నాహాలను కూడా ప్రభుత్వం ప్రారంభించింది. అవసరమైన అన్ని చర్యలను త్వరితగతిన పూర్తి చేయాలని, యువతకు నిర్ణీత గడువులోగా ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు అందించాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లా నుండి ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్‌ల కోసం అర్హులైన విద్యార్థులను గుర్తించాలని అధికారులను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement