రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఇతర ప్రపంచ దేశాల వాణిజ్యంపై ప్రభావం పడనుంది. నిత్యావసర ధరలతోపాటు స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ లు, ఎలక్ట్రిక్ కార్లు, ల్యాప్‌టాప్‌ల ధరలు భారీగా పెరగనున్నాయి. పెట్రోధరల పెరుగుదలతోపాటు నిత్యావసర ధరలు పెరగనున్నాయి. తాజాగా ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ ల ధరలు కూడా అదేబాటలో పయనించనున్నాయి. స్మార్ట్ ఫోన్‌లకు అవసరమయ్యే చిప్‌సెట్‌ల కొరత తీవ్రంగా ఉండనుంది. ఉక్రెయిన్ నుంచి యూఎస్‌కు 90శాతం సెమీకండక్టర్ గ్రేడ్ నియాన్‌ను, సెమీకండక్టర్లను తయారు చేసేందుకు ఉపయోగించే అరుదైనలోహం పల్లాడియంను రష్యా అమెరికాకు 35శాతం ఉత్పత్తి చేస్తుంది.
అత్యంత ఖరీదైన పల్లాడియం లోహం రష్యాలో లభ్యం కావడంతో యుద్ధం కారణంగా రష్యా పల్లాడియం ధరలను పెంచే అవకాశం ఉంది. కాగా ప్రపంచ చిప్‌సెట్ సరఫరాలో రష్యా వాటా 45శాతం ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నియాన్, పల్లాడియం సరఫరాపై ప్రభావం చూపనుంది. తద్వారా సెమీకండక్టర్ వ్యాపార కార్యకలాపాలు స్తంభించిపోయే అవకాశం ఉందని జపాన్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..