న్యూ ఢిల్లీ – స్మార్ట్ వాచ్ లు ధరించడంపై రైల్వేశాఖ ఆంక్షలు విధించింది.. ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదం తరువాత ట్రైన్ డ్రైవర్లు ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండాలని రైల్వే బోర్డు జోన్‌లు , డివిజన్‌లను ఆదేశించింది. భారతీయ రైల్వే శాఖ దేశ వ్యాప్తంగా సేఫ్టీ డ్రైవ్ ప్రికాషన్స్ పాటిస్తున్నారు. ఇప్పటికే మొబైల్ ఫోన్ లపై నిషేధం కొనసాగుతుండగా తాజాగా స్మార్ట్ వాచ్ ధరించడంపై కూడా కఠిన నిబంధనలు విధించింది..
సదరన్ జోన్‌లో ఒక లోకోమోటివ్ పైలట్ గంటకు 110 కి.మీ వేగంతో రైలును నడుపుతున్నప్పుడు తన స్మార్ట్‌వాచ్ ను చూస్తూ రైలు డ్రైవింగ్ చేయడాన్ని అధికారులు గుర్తించారు. అయితే ఆయన స్మార్ట్ వాచ్ ను చాలా కొద్ది సేపు మాత్రమే చూశారు. స్మార్ట్‌వాచ్ స్క్రీన్ తరచుగా ఆన్ అయింది. దీంతో డ్రైవింగ్ పై దృష్టి పెట్టకుండా స్మార్ట్ వాచ్ లో వచ్చే మెస్సెజ్ సిగ్నల్ చూసేందుకే ఎక్కువ సమయంలో వినియోగిస్తున్నాడు.. స్మార్ట్ వాచ్ వల్ల డ్రైవింగ్ విధులలో అలసత్వం కనబరుస్తున్నారని తేలడంతో దీంతో ట్రైన్ రన్నింగ్ లో ఉన్నప్పుడు సిబ్బందికి స్మార్ట్‌వాచ్‌ల వాడకాన్ని నిషేధిస్తూ రైల్వే అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొ్న్నారు.