ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగింది. రోజురోజుకూ వీటి సంఖ్య పెరుగుతూనే ఉంది. అర చేతిలో మొత్తం ప్రపంచాన్ని పెట్టుకుని.. అనుకున్నవిధంగా ముందుకు వెళ్తున్నారు. భారత్ కూడా దీనికి మినహాయింపు కాదు. ఇక్కడ కూడా స్మార్ ్ట ఫోన్ వినియోగదారులు భారీగానే ఉన్నారు. అయితే 2026 కల్లా స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య 1 బిలియన్‌లకు చేరే అవకాశం ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్-ఎనేబుల్డ్ ఫోన్‌ల విక్రయాలు పెరుగుతాయని డెలాయిట్ అనే సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. 2021లో భారత్‌లో 1.2 బిలియన్ల మంది మొబైల్ సబ్ స్క్రైబర్లు ఉన్నారు. వీరిలో దాదాపు 750 మిలియన్‌ల మంది స్మార్ట్ ఫోన్‌ను వినియోగిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో ఇది 1 బిలియన్‌కు చేరుకుంటుందని డెలాయిట్ తెలిపింది.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అధికం..
డెలాయిట్‌కు సంబంధించిన 2022 గ్లోబల్ టీఎంటీ (టెక్నాలజీ, మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్, టెలికాం) అంచనాల ప్రకారం.. 2026 నాటికి స్మార్ట్‌ఫోన్ మార్కెట్ భారీగా పెరుగుతుంది. 2021-2026 మధ్య.. పట్టణ ప్రాంతంలో 2.5 శాతం సీఏజీఆర్ వృద్ధిరేటు పోలిస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే.. కాంపౌండ్ యానువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్) 6 శాతం ఉండనుంది. భారత్ నెట్ ప్రోగ్రాంలో భాగంగా.. 2025 నాటికి అన్ని గ్రామాలను ఫైబర్‌గా మార్చాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్‌నెట్ సదుపాయాన్ని మెరుగుపర్చేందుకు కూడా కొంత సహాపడుతుంది. 2026లో అర్బన్ మార్కెట్‌లో 95 శాతం రీప్లేస్‌మెంట్‌లు కొత్త స్మార్ట్‌ఫోన్‌ల వైపు ఉంటాయని, 2021లో వరుసగా 75 శాతం, 25 శాతంతో పోలిస్తే.. 5 శాతం మాత్రమే.. ప్రీ-ఓన్డ్ ఫోన్‌ల వైపు ఉంటాయని డెలాయిట్ తెలిపింది.
ఫోన్ సగటు జీవిత కాలం నాలుగేళ్లు..
ఫోన్ సగటు జీవితం కాలం నాలుగేళ్లు ఉన్న గ్రామీణ జనాభా ఇదే ధోరణిని ప్రదర్శిస్తుందని భావిస్తున్నారు. 2026లో 80 శాతం రీప్లేస్‌మెంట్‌లు కొత్త డివైజ్‌ల కోసం, 20 శాతం ప్రీ-ఓన్డ్ వాటి కోసం ఉండే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా స్మార్ ్టఫోన్ వినియోగదారుల సంఖ్య పెరగడంతో ఫీచర్ ఫోన్‌లను స్మార్ట్‌ఫోన్‌లతో భర్తీ చేయడం క్రమంగా తగ్గుతుందని భావిస్తున్నారు. పట్టణాల్లో ఫీచర్ ఫోన్ రీప్లేస్మెంట్‌లు 2021లో 72 మిలియన్ల నుంచి 2026లో 60 మిలియన్‌లకు చేరుకుంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో 2021లో 71 మిలియన్ల నుంచి 2026లో 60 మిలియన్‌లకు తగ్గుతాయి. భారతదేశంలో స్మార్ట్‌ఫోన్‌ల డిమాండ్ 6 శాతం, సీఏజీఆర్ వద్ద పెరుగుతుందని అంచనా వేయబడింది. 2021లో 300 మిలియన్ల నుంచి 2026 నాటికి 400 మిలియన్‌ల స్మార్ట్‌ఫోన్‌లకు చేరుకుంటుంది. 2026 నాటికి 80 శాతం డివైజ్‌లు.. (సుమారు 310 మిలియన్ యూనిట్లు) 5జీ ప్రారంభించిన తరువాత.. ఈ అధిక డిమాండ్ ప్రధానంగా సృష్టించబడుతుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..