Wednesday, November 20, 2024

వైరల్ వీడియో: వినాయకుడికి వైసీపీ రంగులు.. జగన్‌ను ప్రశ్నించిన చిన్నపిల్లాడు

ఏపీ, తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అధికారులు చెప్తున్నారు. అయితే తెలంగాణలో ఇప్పటికే వినాయక చవితి వేడుకలకు ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం మాత్రం వినాయకుడి చవితి వేడుకలపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వంపై ఓ చిన్న పిల్లాడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏపీని పూర్తిగా క్రిస్టియన్ రాష్ట్రంగా మార్చాలని సీఎం అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించాడు. కేవలం హిందూవుల పండగలపై మాత్రమే జగన్ సర్కారు ఆంక్షలు ఎందుకు విధిస్తుందని సూటిగా ప్రశ్నించాడు. తాము కచ్చితంగా వినాయకుడి మండపం పెట్టి కరోనా నిబంధనలు పాటిస్తూనే వినాయకుడికి పూజలు చేస్తామని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఈ కుర్రాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

YouTube video

మరోవైపు గుంటూరులో మున్సిపల్ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. చెత్తను తరలించే వాహనాల్లో వినాయక విగ్రహాలను తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పారిశుద్ధ్య సిబ్బందిపై కమిషనర్‌ అనురాధ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శానిటరీ సూపర్‌ వైజర్‌ను విధుల నుంచి తొలగించారు. అత్యుత్సాహంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా వినాయక విగ్రహాలను చెత్త వేసే ట్రాక్టర్‌లో తీసుకెళ్లడంపై కమిషనర్ మండిపడ్డారు. ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్‌తో విచారణకు ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement