Tuesday, November 26, 2024

IPO | భారీగా పబ్లిక్‌ ఆఫర్‌కు చిన్న, మధ్య తరహా కంపెనీలు

ఈ సంవత్సరం మన దేశంలో పెద్ద సంఖ్యలో చిన్న, మధ్యతరహా కంపెనీలు పబ్లిక్‌ ఆఫర్‌కు వస్తున్నాయి. దీంతో ప్రపంచంలోనే లిస్టింగ్స్‌లో అత్యంత బిజీ మార్కెట్‌గా మన దేశ స్టాక్‌ మార్కెట్లు అవతరించాయి. 2023లో ఇప్పటి వరకు 184 సంస్థలు, కంపెనీలు పబ్లిక్‌ ఆఫర్‌కు వచ్చాయి. గతంలో ఏ సంవత్సరంలోనైనా వచ్చిన మొత్తం ఐపీఓల సంఖ్య కంటే ఇవి అధికమని బ్లూమ్‌బెర్గ్‌ తెలిపింది. అక్టోబర్‌లో స్టాక్‌ మార్కెట్‌లోకి 30 కంపెనీలు ప్రవేశించాయి. ఈ సంఖ్య అమెరికా, చైనా, హంగ్‌కాంగ్‌ ఎలా అనేక పేరున్న దేశాల మార్కెట్లలో లిస్టయిన కంపెనీల సంఖ్య కంటే అధికమని తెలిపింది.

2018 తరువాతీ ఈ స్థాయిలో కంపెనీలు పబ్లిక్‌ ఆఫర్‌కు వచ్చేందుక భారత్‌ ఆర్ధిక వ్యవస్థ వేగంగా వృద్ధి నమోదు చేయడం ప్రధాన కారణమని బ్లూమ్‌బర్గ్‌ తన కథనంలో పేర్కొంది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ ఈక్విటీ మార్కెట్‌ కార్యకలాపాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపింది. చైనా మార్కెట్లు నెమ్మదించినప్పటికీ భారత్‌లో మాత్రం ఇన్వెస్టర్‌ డిమాండ్‌ అధికంగా ఉందని పేర్కొంది.

- Advertisement -

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు, తరువాత కూడా బలమైన ఆర్ధిక వ్యవస్థగా ఎదుగుతున్నందున క్యాపిటల్‌ మార్కెట్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని కంపెనీలు భావిస్తున్నాయి. బలమైన భారత్‌ ఆర్ధిక వ్యవస్థ కార్యకలాపాలు పట్ల దేశీయ, విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలంగా ఉండటంతో ఐపీఓ కార్యకలాపాలు పెరుగుదల ఎక్కువగా ఉందని ఎస్‌.ఆర్‌ బాట్లిబాయ్‌ అండ్‌ అసోసియేట్స్‌ భాగస్వామి ఆదర్శ్‌ రంకా అభిప్రాయపడ్డారు.
అక్టోబర్‌లో ఇజ్రాయిల్‌, హమాస్‌ మధ్య యుద్ధం, అమెరికా ఫెడ్‌ రేట్ల పెంపు వార్తలు వంటి పలు కారణాల మూలంగా భారత స్టాక్‌ మార్కెట్లలో ఎక్కువ ఊగిసలాట కనిపించింది. అక్టోబర్‌ 27తో ముగిసిన వారంలో ఎఫ్‌ఐఐలు 1.5 బిలియన్‌ డాలర్లను మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకున్నారు. 2022 సెప్టెంబర్‌ తరువాత ఒలా ఒకే వారంలో ఇంత భారీగా ఎఫ్‌ఐఐల అమ్మకాలు జరగడం ఇదే మొదటిసారి.
భారత్‌లో ఐపీఓల సంఖ్య రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ, ఆదాయం మాత్రం 15 శాతం తగ్గి 4.9 బిలియన్‌ డాలర్లగా ఉంది. దీనికి ప్రధాన కారణం బ్లాక్‌ డీల్స్‌ ఎక్కువగా జరగడమే. గత సంవత్సరం అతి పెద్ద ఐపీఓగా వచ్చిన ఎల్‌ఐసీ ఇన్వెస్టర్లకు 36 శాతం, డెలివరీ స్టార్టప్‌ ఢిల్లిdవేరీ లిమిటెడ్‌ 17 శాతం నష్టాలను అందించాయి.
ఈ సంవత్సరం వచ్చిన ఐపీఓల ఫలితాల విషయం మిశ్రమంగా ఉంది. పర్సనల్‌ కేర్‌ బ్రాండ్‌ హోనాసా కన్జ్యూమర్‌ లిమిటెడ్‌ గత నెలలో ఓపీఓ సైజ్‌ను తగ్గించుకుంది. గృహోపకరణాలు, స్టేషనరీ, ఫర్నీచర్‌ తయారీ సంస్థ సెల్లో వరల్డ్‌ 228 మిలియన్ల ఐపీఓ చివరి రోజు నాటికి
39 రేట్లు సబ్‌స్క్రిప్షన్‌ పొందింది.
ఈ సంవత్సరం ఇప్పటి వరకు వచ్చిన చాలా ఐపీఓలకు ఈక్విటీ మార్కెట్‌లో మంచి ఆదరణ లభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement