Friday, September 6, 2024

Euro Cup | డ్రా గా ముగిసిన స్లోవేనియా – సెర్బియా మ్యాచ్

యూరోపియన్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఈరోజు జరిగిన మరో మ్యాచ్ లో గ్రూప్ సీలోని స్లోవేనియా – సెర్బియా జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయకపోవడంతో తొలి అర్ధభాగం 0-0తో డ్రాగా ముగిసింది.

ఇక‌ ద్వితీయార్ధంలో ఊపందుకున్న స్లోవేనియా 69వ నిమిషంలో ఒక్క గోల్ చేసి… ఆధిక్యంలోకి వెళ్లింది. విజయం ఖాయమని భావిస్తున్న తరుణంలో చివరి నిమిషంలో (90+5 నిమిషానికి) సెర్బియా ఒక్క గోల్ చేసి స్కోరును సమం చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement