Friday, November 22, 2024

ఆఫీసుల్లో పడుకోండి, ఉద్యోగులకు బంపరాఫర్‌.. మధ్యాహ్నం అరగంట అవకాశం..

ఆఫీసుకు వెళ్తే ఉద్యోగులు ఏం చేస్తారు.. పని చేస్తూ ఉంటారు. తీరిక లేకుండా పని చేసే వాళ్లు కొందరుంటే.. ముచ్చట్లు పెడుతూనే పని కానిచ్చే ఆఫీసులు మరికొన్ని ఉంటాయి. అదే ఆఫీసులు నిద్ర పోతే ఇంకేమైనా ఉందా… ఉద్యోగం ఊడినట్టే.. ఆఫీసుకొచ్చి నిద్రపోవడమేంటి..? అన్న మాటలు చాలా కంపెనీల్లో విని ఉంటాం.. కానీ బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్‌ కంపెనీ.. తమ ఉద్యోగుల కోసం అదిరిపోయే నిర్ణయాన్ని తీసుకుంది. ప్రస్తుతం ఉద్యోగాలు చాలా ఒత్తిడితో కూడుకున్నవి. పని ఒత్తిడి కారణంగా.. నిద్రలేమి కూడా ఉంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు మానసిక ఒత్తిడిని తగ్గించే వివిధ మార్గాలను అన్వేషిస్తున్నాయి. కానీ ఈ కంపెనీ మాత్రం తమ ఉద్యోగుల ఆరోగ్యం గురించి ఆలోచించి కీలక నిర్ణయం తీసుకుంది.

పని కారణంగా.. ఒత్తిడి

ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేయకుండా.. కొంత పడుకునే వెసులుబాటును కూడా కల్పించింది. కునుకు తీస్తే.. బాడీతో పాటు మైండ్‌ కూడా ఎంతో రీఫ్రెష్‌ అవుతుంది. వేక్‌ ఫిట్‌ సొల్యూషన్స్‌ అనే స్టార్టప్‌ మధ్యాహ్నం 30 నిమిషాలు కునుకు తీయడానికి ఉద్యోగులకు అవకాశం ఇచ్చింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. ఉద్యోగులు మధ్యాహ్నం 2 నుంచి 2.30 గంటల వరకు కునుకు వెసులుబాటు కల్పించింది. నాసా అధ్యయనం ప్రకారం.. మధ్యాహ్నం 26 నిమిషాల కునుకు తీస్తే ఆ ఉద్యోగి సామర్థ్యం 33 శాతం పెరుగుతుందని వెల్లడైంది. గత ఆరేళ్లుగా వేక్‌ ఫిట్‌ పరుపులు, తలగడలు తయారు చేసే వ్యాపారంలో ఉంది. వేక్‌ పిట్‌ కో ఫౌండర్‌ రామలింగ గౌడ్‌ మాట్లాడుతూ.. తాము గత ఆరేళ్లుగా ఈ వ్యాపారంలో ఉన్నామని, ఉద్యోగులకు విశ్రాంతి కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని, తాము ఎల్లప్పుడూ.. నిద్రను సీరియస్‌గా తీసుకుంటామని చెప్పుకొచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement