టెస్టు క్రికెట్‌లో మరో వండర్‌నెలకొంది. ఆస్ట్రేలియాపై శ్రీలంక బ్యాటర్ చండీమాల్ డబుల్ సెంచరీ చేసి రికార్డులోకి ఎక్కాడు. డబుల్ సెంచరీ చేసిన తొలి వ్యక్తిగా దినేష్ చండిమాల్ నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో 185 పరుగులకు చేరుకున్న తర్వాత చండిమాల్ బ్యాక్-టు-బ్యాక్ సిక్సర్లతో బౌండరీలు కొట్టాడు.
కాగా, ఆస్ట్రేలియాపై డబుల్ సెంచరీలు చేయడంతో శ్రీలంక బ్యాటర్‌గా చండీమాల్ ఫస్ట్ ప్లేయర్ గా నిలిచాడు.. ఇంతక ముందు కూమార సంగక్కర చేసిన 192 రికార్డ్ ని .. 206తో చండిమాల్ బ్రేక్ చేశాడు. దీంతో చండీమాల్‌కి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెటర్లు అభినందనలతో ముంచెత్తుతున్నారు.
ఇదిలాఉండగా.. తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు సాధించిన లంక ఈ టెస్టుపై పట్టుబిగిస్తున్నది. ఆట నాలుగో రోజు మూడో సెషన్ ఆడుతున్న కంగారూలు రెండో ఇన్నింగ్స్ లో తడబడుతున్నారు. 30 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు.. 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (24), ఉస్మాన్ ఖవాజా (29), స్టీవ్ స్మిత్ (0), ట్రావిస్ హెడ్ (5) లు పెవిలియన్ చేరారు. ప్రస్తుతం మార్నస్ లబూషేన్ (29 బ్యాటింగ్), కామెరాన్ గ్రీన్ (20 నాటౌట్) ఆడుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.