Wednesday, November 20, 2024

స్కై వాక్​కు రెడీ.. మెట్రోలో మరో సీమ్​లెస్​ కనెక్టవిటీ మహాద్భుతం..

స్కై వాక్​కు ఢిల్లీ మెట్రో రెడీ అయ్యింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని అజ్మీరీ గేట్ వైపు, ఆ పక్కనే ఉన్న న్యూఢిల్లీ మెట్రో స్టేషన్‌ మధ్య అతుకులు లేని కనెక్టివిటీని అందించేందుకు 242 మీటర్ల పొడవైన స్కైవాక్ రేపు ప్రారంభం కానుంది. ఉత్తర రైల్వే సహకారంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ఈ స్కైవాక్‌ను నిర్మించింది. స్కైవాక్ ఎల్లో లైన్, ఎయిర్‌పోర్ట్ ఎక్స్ ప్రెస్ లైన్‌లో ఉందని, ఇది రేపు ఉదయం 10 గంటల నుండి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు.  

ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడమే లక్ష్యం..

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని అత్యంత రద్దీ కేంద్రాల్లో ఒకటైన ఎల్లో లైన్, ఎయిర్‌పోర్ట్ ఎక్స్ ప్రెస్ లైన్‌లోని న్యూఢిల్లీలోని మెట్రో స్టేషన్‌ల మధ్య అతుకులు లేని కనెక్టివిటీని అందించడానికి స్కైవాక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సీమ్​లెస్​ కనెక్టివిటీని అందించడమే కాకుండా, రైల్వే స్టేషన్ యొక్క అజ్మేరీ గేట్ వైపు ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించడంలో స్కైవాక్ సహాయపడుతుంది. ఇందులో ఎస్కలేటర్లతో పాటు సీసీటీవీ నిఘా కెమెరాలు, ఇతర సౌకర్యాలు కల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement