రాకేశ్ ఝున్‌ఝున్ వాలా ప్రధాన ప్రమోటర్‌గా ఉన్న బడ్జెట్ ఎయిర్‌లైన్స్ ఆకాశ ఎయిర్‌లైన్స్ నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఈ సంస్థ కార్యకలాపాలు వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు సంస్థ సీఈఓ వినయ్ దూబే ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది జూన్ నుంచి సంస్థ విమానాలను ప్రారంభించనుంది. దీనిలో భాగంగా ఇప్పటికే ఆకాశ ఎయిర్‌లైన్స్ సంస్థ పౌర విమానయాన మంత్రిత్వశాఖ, డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)తో అవసరమైన అనుమతులు పొందేందుకు చర్చలు జరుపుతున్నట్లు వినయ్ వెల్లడించారు.
హైదరాబాద్‌లో జరుగుతున్న ‘వింగ్స్ ఇండియా 2022’ ఏవియేషన్ షోలో పాల్గొన్న వినయ్‌దూబే ఆకాశ ఎయిర్ గురించి ప్రస్తావించారు. జూన్‌లో మొదటి ఫ్లైట్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించిన దూబే ఏ నగరాల మధ్య నడుస్తుంది అనే విషయం మాత్రం వెల్లడించలేదు. అయితే మొదటి ఫ్లైట్ ప్రారంభమైన తర్వాత ఏడాది వ్యవధిలో మొత్తం 18 విమానాలను నడిపించనున్నట్లు వివరించారు. కాగా గత ఏడాది నవంబర్‌లో ఆకాశ ఎయిర్ సంస్థ 72 బోయింగ్, 737 మ్యాక్స్ జెట్స్ కోసం ఆర్డర్ ఇచ్చింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి...