Friday, November 22, 2024

పదహారు కోట్ల ఉద్యోగాలేవీ? మోడీకి ఖర్గే ప్రశ్న

హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధికారానికి రావడానికి ముందు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తానని నమ్మబలికారనీ,దేశంలో కోట్లాది మంది నిరుద్యోగులుండగా,ఇటీవల కొన్ని వేల మందికే ఉద్యోగ నియామక పత్రాలనుఅందజేశారని ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే విమర్సించారు.ఆయన ట్విట్టర్‌లో ప్రధానమంత్రిపై తీవ్రమైన విమర్శలు చేశారు.ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలివ్వడం అంటే ఈ పాటికి 16 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాల్సిందనీ,కానీ, ఢిల్లిdలో 75 వేల మందికి,గుజరాత్‌లో 13 వేల మందికి,జమ్ము,కాశ్మీర్‌లో 3 వేల మందికి మాత్రమే ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారని ఖర్గే విమర్శించారు.ఈ చిన్న పాటి కార్యక్రమానికే రోజ్‌గార్‌ మేళా అని సంబంధించడం అత్యుక్తిగాఉందని ఆయన అన్నారు.దేశంలోగ్రామీణప్రాంతాల్లో నిరుద్యోగ సమస్య ఎన్నడూలేనంతగా పెరిగిందనీ,నిరుద్యోగుల శాతం 7.2కి పెరిగిందనీ, యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మోడీ ప్రభుత్వం నీరు గార్చిందని ఆయన ఆరోపంచారు. కొత్తగా ఉద్యోగాలివ్వకపోగా మేక్‌ ఇన్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా వంటి పెద్ద మాటలతో ప్రజల కడుపు నింపే కసరత్తులు చేస్తున్నారంటూ మోడీపై ఖర్గే తీవ్రమైన అస్త్రాలు సంధించారు.ఉపాధి కల్పన విషయంలో మోడీ ప్రభుత్వానికి తగిన ఆలోచన,దిశా లేకపోవడమే ఇందుకు కారణమని ఆయన అన్నారు.నిరుద్యోగులను నిరుత్యాహానికి గురి చేస్తూ మరో వంక కోట్లకు పడగలెత్తినవారికి ఎంతో సాయంచేయడానికి మోడీ ప్రభుత్వం వెనకాడటం లేదని ఖర్గే ఆరోపించారు.కేవలం ఒకటి ,రెండు కుటుంబాలకు మాత్రమే మోడీప్రభుత్వం సాయం అందిస్తోందని ఆయన ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement